Wednesday, December 24, 2008

posterous

మీ మెయిల్ నుండే మీరు బ్లాగ్పోష్టు రాద్దామనుకుంటున్నారా?
మీ మెయిల్ నుండి మీరు ఓ యం.పీ.మూడుని మీ బ్లాగుకి పబ్లిష్ చేద్దామనుకుంటున్నారా?
మీ మెయిల్ నుండి ఓ ఫోటో మీ బ్లాగుకి పబ్లిష్ చేద్దామన్కుంతున్నారా?
ఇది వాడండి పోస్టెరస్. ఉదాహరణకి నా పోస్టెరస్ బ్లాగు ఇక్కడ

Saturday, December 6, 2008

యం.సి.యేలకి, సి.యస్.ఇ లకీ ఓ ప్రాజెక్ట్ ఆలోచన

మీరు ప్రాజెక్ట్ వర్కు కోసం వెతుకుతున్నారా. ఐతే ఇక్కడనుండి మొదలెట్టండి.

మీదెగ్గర మొబైలు ఫోను ఉంది అనుకోండి. హారిక మీకు ఫోను చేసింది, మీరు మాట్టాడుతున్నారు, ఈలోపల నరేష్ చేసాడు. మీలైను ఖాళీగాలేదు కాబట్టి, అతని కాల్ వాయీస్ మెసేజిబాక్స్కి వెళ్తుంది అనుకుందాం. నరేష్ మీకో వాయీస్ మెస్సేజ్ వదిలాడు, "ఆరేయ్!! నువ్వు బహుసా బిజీగా ఉన్నట్టు ఉన్నావ్. నా మెసేజ్ చూస్కోంగనే నాకు మళ్లీ కాల్ చెయ్" అని. Is it possible to convert this voice message to a text and push to your mobiles messages inbox as text, meaning, convert that voice into text?
If possible, start doing it :):)

Think

Added : Dec 8th.
ఎలాంటి పరీస్తుతుల్లో వాయీస్ మెస్సేజ్లు వస్తాయ్? ఎలాంటి పరీస్తిత్తుల్లో వాటిని టెక్స్టుగా మార్చవచ్చు?
#1. You are out of coverage area, some one called you, call gone to your vioce message box, caller left a message. You got say 23 calls on that day, all of them somehow went to your voice message box. Dont you think its good if u can have those converted to ur text message than hearing to each call?
#2. You are in a meeting, u set ur mobile to silent. U got three imp calls. you can check text inbox but, situation is not allowing u check your voice messages. is it not a good idea to have those voice calls as text messages?
#3. You are on a call with your boss, thru ur blootooth, you got an imp call from say, ur wife, father, he left a message. If you have this finctionlity, you can keep talking to your boss, parallelly check this message too.
yaata yaata yaata..

Wednesday, December 3, 2008

విజ్ఞప్తి

విశాఖపట్టణం నుండి, హైదరాబాదు నుండి, గుంటూర్ విజయవాడల నుండి ఎవరైనా బ్లాగర్లు ఈ నా పోష్టుని చదివితే, దయచేసి నాకు ఒక ఇ-ఉత్తరం రాయగలరు. నాకు మన వాటర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్ మీద కొంత సమాచారం కావాలి.
నా ఇ-ఉత్తరం చిరునామా - projectsforfuture@gmail.com
జై హింద్

Monday, December 1, 2008

హోమ్ ఎనర్జి స్టేషన్


The Home Energy Station, which generates hydrogen from natural gas, is designed to provide heat and electricity for the home through fuel cell cogeneration and to supply fuel for a hydrogen-powered fuel cell vehicle.
Honda has worked in cooperation with technology partner Plug Power, Inc., to reduce size and increase convenience in each subsequent generation of the Home Energy Station.
Read the complete Story Here:
http://automobiles.honda.com/fcx-clarity/home-energy-station.aspx
పైన బొమ్మలో నాకు ముఖ్యమైనవిగా తోచినవాటిని మార్క్ చేసాను.
ఈ లింక్ నాకు పంపినది - అమర్, సిస్టం యడ్మినిస్ట్రేటర్, హైదరాబాద్.

Monday, November 24, 2008

చైనా మార్కెట్లు

మేడ్ ఇన్ చైనా ఆర్ మ్యాడ్ ఇన్ చైనా!! సుత్తినాకొడుకులు. ఎక్కడజూసినా చైనబజార్, చైనా మార్కెట్టు. ప్లాష్టిక్కు డబ్బాలు, ప్లాష్టిక్కు సంచులు - మ్యాడ్ ఇన్ చైనా. ఇంకో విషయం ఆ ప్లాష్టిక్కు ఓ రకమైన వాసన. అవితెచ్చి అమ్మే ఎదవనాకొడుకుల్ని కుమ్మిఅవతలెయ్యాలి. చదువుకున్న యువతీ యువకుల్లారా!! "మేడ్ ఇన్ చైనా" ని మనం రుపుమాపలేమా?

Monday, November 17, 2008

మన పెట్రో అవసరాలు

పంజా గుట్ట నుంచి అమీర్ పేట వెళ్లటానికి ఒకానొక రోజున కనీసం ముప్పై నిమిషాలు పట్టేది. మరి ఇప్పుడు ఎలాఉందో? నిజ దూరం రెండు కిలో మీటర్లు (+/- ౧)మాత్రమే. మనం మన పెట్రో అవసరాల్ని తగ్గించుకోలేమా? ఊర్కనే టైమ్ పాస్ కి, అలా ప్రెసిడెన్సీ దాకనో, లేక ఇంకో సెంటర్ దాకనో వెళ్లి ఒక చాయ్ కొట్టిరావటానికి మనం ఎంత పెట్రోలుని ఖర్చు పెడుతున్నామో ఆలోచించుకోవాలి.

Monday, November 10, 2008

చెత్త చెదారం - విద్యుత్తు

చెత్తా చెదారం - వేష్టు మటేరీల్ నుంచి విద్యుత్తుని ఉత్పత్తి చేయొచ్చా. చేయొచ్చు, చాలా మంది చేస్తున్నారు కూడా. ఐతే ఇక్కడ ప్ర
శ్న తక్కువఖర్చు తో, ఒక చిన్న తరహా పరిశ్రమలా ఎలా చేస్కోవచ్చు అని?

Friday, November 7, 2008

బ్రాండింగ్

బ్రాండింగ్ అంటే - ఒక గుర్తు. ఒక సంస్థ మాత్రమే ఈ వస్థువు చెయ్యగలదు అనే నమ్మకం.
ఇలా చెప్పాడు తెల్లోడు
The American Marketing Association (AMA) defines a brand as a "name, term, sign, symbol or design, or a combination of them intended to identify the goods and services of one seller or group of sellers and to differentiate them from those of other sellers.

Therefore it makes sense to understand that branding is not about getting your target market to choose you over the competition, but it is about getting your prospects to see you as the only one that provides a solution to their problem.

పల్లెల్లోకూడా పచారి కొట్టుకివెళ్లి ఓ టూత్పేష్ట్ ఇవ్వవోయ్ అని అడగడు ఎవ్వడూ, ఓ కోల్గేట్ ఇవ్వు అని అంటాడు. అదీ బ్రాండింగ్ అంటే.

మనం ఎన్నో విషయాల్లో ఆహా ఓహో అనుకుంటాం. కానీ మనకి అతి తక్కువ బ్రాండ్లు ఉన్నయి. మనవి అంటే మనం సోంతగా చేస్కున్నవి, మనం వెఱ్ఱెత్తిపోయి కొనుక్కునేవి అని.
బ్రూక్బాండ్ కాఫీ మనది కాదు
కోల్గేట్ పామోలివ్ - మనది కాదు
లిప్టన్ - మనది కాదు
టాటా, బిర్లా, లాంటివి కొన్ని మాత్రమే మనవి.
ఇక చిన్నపిల్లలకి హీరోలు -
మికిమౌస్, డానాల్డ్ డక్, డిస్నీ కార్స్, డియాగో, డోరా, ఇంక్రెడిబుల్స్, వీళ్లందరూ బయటివాళ్లే. ఇక్కడ విషయం ఏంటంటే, జపాన్ వాశులకి వాళ్ల హీరోలున్నారు పోకెమోన్, డొరెమోన్, ఒజమజో డొరెమి, కిట్టి ఇలా. కాని మనం మాత్రం మన బ్రాండ్ని ఐకాన్స్ ని తయ్యారుచేస్కోలెక పోతున్నాం. అన్నిటికంటే ఆలోచించాల్సిన విషయం ఏంటాంటే ఈ బ్రాండింగుతో వాటి సంస్థలు వివిధ విధాల మార్కెటింగు చేస్తుంటాయి. అంటే, ఉదాహరణకి డియాగో బొమ్మలు, డి.వి.డి లు, గేములు, బట్టలు, బ్యాగులు అవి ఇవి. చూసారా వీటిల్లో ఎంత ధనం దాగుందో. మనం అప్పణాంగా ఇవికొనేస్కుని ఈ ధనవంతుల్ని ఇంకా ధనవంతులుగా తీర్చి దిద్దుతున్నాం.
ఒకానొకరోజుల్లో మన బామ్మలు, తాతయ్యలు ఎన్నో కధలు చెప్పేవాళ్లు. వాటిల్లోంచి మనం హీరోలని దేనికి తయ్యారుచేస్కోలేకపోతున్నాం?
మనకీ ఒకానొక రోజుల్లో బ్రాండ్లు ఉండేవి. మనమే వాటిని మూసేయించి, బహుళజాతుల్ని మనమే ఆహ్వానించి వాళ్లకి మనమే మన ఇంట్లో పంటనే పెట్టి పోషించి, మనమే ఎంగిలి ఎత్తేసి, పళ్లెం కడిగి, తాంబూలం ఇచ్చి, మన అనే గుర్తింపుని మనమే నిర్దాక్షిణ్యంగా చంపేస్కుంటున్నాం.

ఓరోజున నేను బ్రాడీపేటలో ఓ టీకొట్టు దెగ్గర టీ తాగుతూ నుంచున్నా. ఓ కుర్రోడు వచ్చాడు. అవి ఇవి అయ్యాక, "నేను యం.బి.యే చేస్తున్నా, ప్రాజెక్టు వర్కు కోసం చూస్తున్నా" అని చెప్పాడు. నేను, గుంటూర్లో యఫ్.యం పెట్టాలి అంటే ప్రోస్పెక్ట్స్, అస్సలు బిజినెస్ జరుగుతుందా బ్లా బ్లా కనుక్కునిరా, 2 నెలలు టైం ఇస్తా, సర్వే చెయ్, ఎలాంటి జనాలు దానికి బిజినెస్ ని ఇవ్వగలరు (యాడ్స్ రూపంలో), అసలు ఎంత మంది మాకు గుంటూర్లో యఫ్.యం కావాలి అనుకుంటున్నారు ఇత్యాది విషయాలు సేకరించు - నేను 10000 కూడా ఇస్తా అని చెప్పా. మళ్లీ ఆ కుఱ్ఱాడు కనపళ్లా. అదీ కధ. ఇంక మన బ్రాండింగు ఎవడికి కావాలి!!

ఈరోజుటి యం.బీ.యే లు, ఇంజనీరింగు విద్యార్ధులు, గ్రాడ్యుయేట్ విద్యార్ధులు, యం.సి.యే లూ, పీ.జీలూ .. అందరూ కలసి కూర్చుని వాళ్ల ఐడియాలని పంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనుకుంటున్నా.

మీరేమంటారు?

Thursday, November 6, 2008

రిసైకిల్డ్ గ్లాస్ కౌంటర్ టాప్స్

మీకు తెల్సా : గాజుని రి-సైకిల్ చేసి కిచెన్లలో/బాత్ రూమ్ముల్లో కౌంటర్ టాప్ లా వాడుకోవచ్చు.

రి-సైకిల్డ్ గాజు కౌంటర్టాప్స్ చలువరాయి, గ్రానైటు, క్వార్ట్జ్ కన్నా చాలా తక్కువ ధరకి లభిస్తుంది.

Unique appearance – Recycled glass countertops have a distinct appearance that makes it very clear what they are made of. In some cases they are custom designed to create a special look. In others, however, they have the appearance of old fashion and still quite fashionable mosaic art.


Strength – Because they are often created using cement and other hard materials in the mix, recycled glass countertops are much stronger than many would give them credit for. The finished surface, in fact, compares quite favorably with granite and other similar hard surfaces.



Durability – Recycled glass countertops are not necessarily impervious to damage, but they are incredibly strong and hard to damage. They are very difficult to cut, break, chip, crack and even stain. They resist scratches, burns and other common cosmetic complaints found with other common materials.



Ease of cleaning – Recycled glass countertops are very easy to keep clean. Generally, all that is required is a simple wipe down with a wet cloth. If water stains appear, mild detergent will remove them. The surface is such that most materials simply will not stick on these counters.


Ease of maintenance – While they do require some maintenance, recycled glass countertops compare quite well with other options. Resealing, for example, is often suggested on a one-to-two-year basis. It is also quite possible to have craftspeople fix any chips or scratches that might be put into these counters.

Monday, November 3, 2008

ఫిస్కర్ కర్మ - క్యూ డ్రైవ్ టెక్నోలజి

ఫిస్కర్ అనేది ఒక ఆటోమొబైల్ తయారీ దారు. కర్మ అనేది వాడి కారు మోడలు. వాళ్ల వెబ్ సైట్ http://www.fiskerautomotive.com/



వీళ్ల అండర్ లైన్డ్ టెక్నోలజి "Q DRIVE HYBRID TECHNOLOGY". Q DRIVE అనేదాన్ని తయారు చేసేది క్వాంటం టెక్నోలజీస్ అనే కంపెని (NASDAQ: QTWW).
This is the technology

Fisker Automotive is taking a novel approach to merging beauty and style with an environmental conscience. The car features cutting-edge plug-in hybrid technology, penned as Q DRIVE, developed by Quantum Technologies exclusively for Fisker Automotive. The Karma's Q DRIVE configuration consists of a small gasoline engine that turns the generator, which charges the lithium ion battery pack, powering the electric motor and turning the rear wheels.

This proprietary design allows consumers' to drive the car emission free for up to 50 miles (80km) a day provided the car is charged every evening. It's conceivable that if consumers follow this daily routine, they will only need to fuel the car but once a year. This means it will not only cut down on pollution and global warming, but on a consumer's gasoline budget as well. This Q DRIVE technology will provide a base for all
future derivatives from Fisker Automotive.

The Fisker Karma will offer partly self-contained climate control, as consumers will have the option to purchase a full-length solar roof that will help charge the car and provide cooling for the interior cabin while the car is parked. Additionally, Fisker Automotive will offer consumers an option to purchase a set of solar panels for their roofs or garages where they can generate electricity during the day to charge the car overnight…again cost and emission free.

Statistics show that the majority of pollution from automobiles occurs on consumers' daily commute to and from work or dropping the kids off at school. Currently, more than 60% of Americans and Europeans are driving less than 50 miles (80km) on their daily commute. If this 60% of commuters would drive a plug-in hybrid like the Fisker Karma, we could see the fastest possible reduction both in oil consumption and emissions - all without sacrificing their daily driving habits. Additionally, plug-in hybrids have the potential to augment the planning of cleaner electrical power plants, ultimately producing a dramatic effect on our society and future generations.

మనం ఇలాంటి టెక్నోలజీని ఉపయోగించి మన విద్యుత్తు అవసరాల్ని ఎలా తీర్చుకోగలం? విద్యుత్తు ఉపకరణాలకి ఈలాంటి ప్లగ్గిన్ ని ఎలా అమర్చుకోగలం?

Friday, October 31, 2008

మనది - యం.యన్.సి - మనం

కాయితం కోసం పంట పండించింది మనం
కాయితం తయ్యారు చేసిందీ మనమే
బాత్ రూం కి వెళ్తే నీళ్లూ మనవే, కడుక్కున్న చేతులు, మొహం మనదే.
ఐతే అక్కడ కింబర్లె-క్లార్కు గాడు ఏంజేస్తున్నట్టు?

మన IT మహానగరాల్లో పనిచేసే IT జనాలకి కింబర్లె-క్లార్క్ హోల్డరు నుంచి కాయితం లాక్కుని చేతులు తుడ్చుకుంటే కానీ సమ్మగా ఉండదా?

Wednesday, October 29, 2008

ఫెడెక్స్ సోలార్ విద్యుదుత్పత్తి కేంద్రం - కాలిఫోర్నియా

౨౦౦౫ (2005) లో ఫెడెక్స్, కాలిఫోర్నియా రాష్ట్రంలోకల్లా అతిపెద్ద సోలార్ విద్యుత్తు కేంద్రాన్ని నెలకొల్పింది.
ఆలోచన ఏంటంటే, ఫెడెక్స్ కి ఓక్లాండ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఒక హబ్ ఉంది, ఆ కేంద్రం యొక్క రూఫ్టాప్ వైశాల్యం 81,000 చదరపు ఆడుగులు. ఫెడెక్స్ వాళ్లు ౩ లక్షల షార్ప్ సోలార్సెల్స్ ఉపయోగించి ఈ రూఫ్టాప్ మీద 5769 ఫోటోవోల్టాయిక్ మాడ్యూల్స్ని నిర్మించారు. ఇక్కడ 904 కిలోవాట్ విద్యుదుత్పాదన జరుగుతుంది.
వీళ్లకి ఇది ఎందుకూ? ఈ విద్యుత్తు వాళ్ల 80 శాతం అవసరాల్ని తీరుస్తుందట. వాళ్ల ఈ హబ్ లో రోజుకి 260,000 ప్యాకేజీలు వస్తుంటాయట. వాటిని కన్వేయర్ బెల్టులమీద సెగ్రిగేట్ చెయ్యటానికీ, కంటైనర్లలోకి పంటానికీ ఆ ఫెసిలిటీని నడపడానికీ చాలా విద్యుత్తు అవసరం.
ఇది చదివి నేను ఆశ్చర్యపోయా.
మన హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాంటి పెద్ద పెద్ద ఇన్స్టాల్లేషన్స్ ని నడాపడానికి ఎన్ని కిలోవాట్ల విద్యుత్తు అవసరం? మనంకూడా ఇలా సాంప్రదాయేతర వనరుల్ని వినియోగించుకుంటే ....

సోలార్ విద్యుత్తు

మీ సమాచారం కొరకు:
ఇస్రాయేల్ లో ప్రతీ ఇంటికీ సోలార్ వాటర్ హీటర్లు తప్పని సరి - మ్యాన్డేటోరీ. అక్కడి ప్రభుత్వం అలాంటి మ్యాన్డేటోరీలని ఇంకొన్ని ప్రవేశపెట్టబోతోంది. మనోళ్ళు ఇక్కడ నాకు కుర్చీ అంటే నాకు కుర్చీ అని కొట్టుసావటమే కానీ ఇలాంటి ఒక్క నిర్ణయం లేదు. ఆలోచించండి.

సాంప్రదాయేతర వనరులు

సాంప్రదాయేతర వనరుల్ని ఎఫిషియెంట్ గా ఎలా ఉపయోగించుకోవాలి?
రాబోయే ౨౦ (ఇరవయ్) సంవత్సరాలల్లో విద్యుత్తు ఉత్పత్తి/ఖర్చు కి మధ్య ఉన్న అంతరాన్ని ఎలా ఎదుర్కోవాలి?