బ్రాండింగ్ అంటే - ఒక గుర్తు. ఒక సంస్థ మాత్రమే ఈ వస్థువు చెయ్యగలదు అనే నమ్మకం.
ఇలా చెప్పాడు తెల్లోడు
The American Marketing Association (AMA) defines a brand as a "name, term, sign, symbol or design, or a combination of them intended to identify the goods and services of one seller or group of sellers and to differentiate them from those of other sellers.
Therefore it makes sense to understand that branding is not about getting your target market to choose you over the competition, but it is about getting your prospects to see you as the only one that provides a solution to their problem.
పల్లెల్లోకూడా పచారి కొట్టుకివెళ్లి ఓ టూత్పేష్ట్ ఇవ్వవోయ్ అని అడగడు ఎవ్వడూ, ఓ కోల్గేట్ ఇవ్వు అని అంటాడు. అదీ బ్రాండింగ్ అంటే.
మనం ఎన్నో విషయాల్లో ఆహా ఓహో అనుకుంటాం. కానీ మనకి అతి తక్కువ బ్రాండ్లు ఉన్నయి. మనవి అంటే మనం సోంతగా చేస్కున్నవి, మనం వెఱ్ఱెత్తిపోయి కొనుక్కునేవి అని.
బ్రూక్బాండ్ కాఫీ మనది కాదు
కోల్గేట్ పామోలివ్ - మనది కాదు
లిప్టన్ - మనది కాదు
టాటా, బిర్లా, లాంటివి కొన్ని మాత్రమే మనవి.
ఇక చిన్నపిల్లలకి హీరోలు -
మికిమౌస్, డానాల్డ్ డక్, డిస్నీ కార్స్, డియాగో, డోరా, ఇంక్రెడిబుల్స్, వీళ్లందరూ బయటివాళ్లే. ఇక్కడ విషయం ఏంటంటే, జపాన్ వాశులకి వాళ్ల హీరోలున్నారు పోకెమోన్, డొరెమోన్, ఒజమజో డొరెమి, కిట్టి ఇలా. కాని మనం మాత్రం మన బ్రాండ్ని ఐకాన్స్ ని తయ్యారుచేస్కోలెక పోతున్నాం. అన్నిటికంటే ఆలోచించాల్సిన విషయం ఏంటాంటే ఈ బ్రాండింగుతో వాటి సంస్థలు వివిధ విధాల మార్కెటింగు చేస్తుంటాయి. అంటే, ఉదాహరణకి డియాగో బొమ్మలు, డి.వి.డి లు, గేములు, బట్టలు, బ్యాగులు అవి ఇవి. చూసారా వీటిల్లో ఎంత ధనం దాగుందో. మనం అప్పణాంగా ఇవికొనేస్కుని ఈ ధనవంతుల్ని ఇంకా ధనవంతులుగా తీర్చి దిద్దుతున్నాం.
ఒకానొకరోజుల్లో మన బామ్మలు, తాతయ్యలు ఎన్నో కధలు చెప్పేవాళ్లు. వాటిల్లోంచి మనం హీరోలని దేనికి తయ్యారుచేస్కోలేకపోతున్నాం?
మనకీ ఒకానొక రోజుల్లో బ్రాండ్లు ఉండేవి. మనమే వాటిని మూసేయించి, బహుళజాతుల్ని మనమే ఆహ్వానించి వాళ్లకి మనమే మన ఇంట్లో పంటనే పెట్టి పోషించి, మనమే ఎంగిలి ఎత్తేసి, పళ్లెం కడిగి, తాంబూలం ఇచ్చి, మన అనే గుర్తింపుని మనమే నిర్దాక్షిణ్యంగా చంపేస్కుంటున్నాం.
ఓరోజున నేను బ్రాడీపేటలో ఓ టీకొట్టు దెగ్గర టీ తాగుతూ నుంచున్నా. ఓ కుర్రోడు వచ్చాడు. అవి ఇవి అయ్యాక, "నేను యం.బి.యే చేస్తున్నా, ప్రాజెక్టు వర్కు కోసం చూస్తున్నా" అని చెప్పాడు. నేను, గుంటూర్లో యఫ్.యం పెట్టాలి అంటే ప్రోస్పెక్ట్స్, అస్సలు బిజినెస్ జరుగుతుందా బ్లా బ్లా కనుక్కునిరా, 2 నెలలు టైం ఇస్తా, సర్వే చెయ్, ఎలాంటి జనాలు దానికి బిజినెస్ ని ఇవ్వగలరు (యాడ్స్ రూపంలో), అసలు ఎంత మంది మాకు గుంటూర్లో యఫ్.యం కావాలి అనుకుంటున్నారు ఇత్యాది విషయాలు సేకరించు - నేను 10000 కూడా ఇస్తా అని చెప్పా. మళ్లీ ఆ కుఱ్ఱాడు కనపళ్లా. అదీ కధ. ఇంక మన బ్రాండింగు ఎవడికి కావాలి!!
ఈరోజుటి యం.బీ.యే లు, ఇంజనీరింగు విద్యార్ధులు, గ్రాడ్యుయేట్ విద్యార్ధులు, యం.సి.యే లూ, పీ.జీలూ .. అందరూ కలసి కూర్చుని వాళ్ల ఐడియాలని పంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనుకుంటున్నా.
మీరేమంటారు?
Friday, November 7, 2008
Subscribe to:
Post Comments (Atom)
8 comments:
nuvvu eee caste baaava.....arreeee needhi naaa caste kaadha ??? ayithe neee brand oka waste....oka vella nuvvu praytnichina nenu ninnu neeee brand ni paiki ranivvanu...endhukante manamantha baaavilo kappalam....idhi mana andhrula kadha...
thappu ga raasthe kshminchandi readers.....idhi nijam
భారత దేశంలో మనుషులు అందరూ 200 సంవత్సరాల బ్రిటిష్ పాలనకు బానిసలై ఇప్పటికికూడా అదే తరహా ఆలోచనలు చేస్తున్నారు. ఉదాహరణకు, ప్రభుత్వం అన్నా, ప్రభుత్వ విధనాల్లన్నా లెక్కలేనితనం. ముందు మనుషులు మారాలి తరువాత ఏదైనా మారుతుంది.
బ్రిటిష్ వాళ్ళు మన మధ్య గొడవలు పెట్టడానికి వాడుకున్న కులాలు, మతాలు, జాతులు, వర్గాలు అనే జాడ్యాలు ఇప్పటికీ మన జనాలు కొనసాగిస్తున్నారు. కుక్క తోక వంకరలాగా మనవాళ్ళ బుద్ది ఇంకా మారలేదు....బుద్ది, మనసు, ఆలోచన మారితేనే మార్పు సాద్యం.
emi analenu !
brands(esp foreign) anevi fashionable anukuni ads lo oodara godutunnantha varaku,ee pichi taggadu ... deeni meeda evaru edi chesedemi undadu !!!
bata shoes brand ani evaru anukovatledu ippudu ! this is not a problem for just india ! anywhere in the world, made in "someother country than this" ... is a fashion statement !
Agree, your blogs are really interesting.
Harinath: Thanks You.
If we really think abt acheiving something then even we can do wonders..all these issues like caste .. n our peoples mind set..all these will not effect if we try ...n....try....hope we may build a brand n the one who didn't supported once he may use our brand....everything can happen man...look around few ambanis..n tatas...r already in their early stages they may grow to a big state..anyways nice post..nice discussion...n m also trying to build one brand..n hope one day i'l post the same one here
మనకు అతి తక్కువ బ్రాండ్లు ఉన్నాయి అన్న విషయం చాలా కరెక్టు. ఉన్నవాటిల్లో ఆర్ధికంగా లాభం సంపాదించేవి తక్కవే. యోగా, ధ్యానం వంటిని ప్రత్యక్ష, పరోక్షంగా పర్యాటక రంగానికి కొంత సహాయం చేస్తున్నాయి.
ఇంటర్నెట్ రేడియో గురించి ఆలోచించారా..@
Post a Comment