౨౦౦౫ (2005) లో ఫెడెక్స్, కాలిఫోర్నియా రాష్ట్రంలోకల్లా అతిపెద్ద సోలార్ విద్యుత్తు కేంద్రాన్ని నెలకొల్పింది.
ఆలోచన ఏంటంటే, ఫెడెక్స్ కి ఓక్లాండ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఒక హబ్ ఉంది, ఆ కేంద్రం యొక్క రూఫ్‌టాప్ వైశాల్యం 81,000 చదరపు ఆడుగులు. ఫెడెక్స్ వాళ్లు ౩ లక్షల షార్ప్ సోలార్సెల్స్ ఉపయోగించి ఈ రూఫ్‌టాప్ మీద 5769 ఫోటోవోల్టాయిక్ మాడ్యూల్స్‌ని నిర్మించారు. ఇక్కడ 904 కిలోవాట్ విద్యుదుత్పాదన జరుగుతుంది.
వీళ్లకి ఇది ఎందుకూ? ఈ విద్యుత్తు వాళ్ల 80 శాతం అవసరాల్ని తీరుస్తుందట. వాళ్ల ఈ హబ్ లో రోజుకి 260,000 ప్యాకేజీలు వస్తుంటాయట. వాటిని కన్వేయర్ బెల్టులమీద సెగ్రిగేట్ చెయ్యటానికీ, కంటైనర్లలోకి పంటానికీ ఆ ఫెసిలిటీని నడపడానికీ చాలా విద్యుత్తు అవసరం.
ఇది చదివి నేను ఆశ్చర్యపోయా.
మన హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాంటి పెద్ద పెద్ద ఇన్స్టాల్లేషన్స్ ని నడాపడానికి ఎన్ని కిలోవాట్ల విద్యుత్తు అవసరం? మనంకూడా ఇలా సాంప్రదాయేతర వనరుల్ని వినియోగించుకుంటే ....
Wednesday, October 29, 2008
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
నాకు కూడా అర్థం కావటం లేదు. ప్రభుత్వం ఉచిత విద్యుత్ స్థానంలో సౌర విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేస్తే ఏమవుతుందో ... ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయేమో ....
Post a Comment