Friday, October 31, 2008

మనది - యం.యన్.సి - మనం

కాయితం కోసం పంట పండించింది మనం
కాయితం తయ్యారు చేసిందీ మనమే
బాత్ రూం కి వెళ్తే నీళ్లూ మనవే, కడుక్కున్న చేతులు, మొహం మనదే.
ఐతే అక్కడ కింబర్లె-క్లార్కు గాడు ఏంజేస్తున్నట్టు?

మన IT మహానగరాల్లో పనిచేసే IT జనాలకి కింబర్లె-క్లార్క్ హోల్డరు నుంచి కాయితం లాక్కుని చేతులు తుడ్చుకుంటే కానీ సమ్మగా ఉండదా?

Wednesday, October 29, 2008

ఫెడెక్స్ సోలార్ విద్యుదుత్పత్తి కేంద్రం - కాలిఫోర్నియా

౨౦౦౫ (2005) లో ఫెడెక్స్, కాలిఫోర్నియా రాష్ట్రంలోకల్లా అతిపెద్ద సోలార్ విద్యుత్తు కేంద్రాన్ని నెలకొల్పింది.
ఆలోచన ఏంటంటే, ఫెడెక్స్ కి ఓక్లాండ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఒక హబ్ ఉంది, ఆ కేంద్రం యొక్క రూఫ్టాప్ వైశాల్యం 81,000 చదరపు ఆడుగులు. ఫెడెక్స్ వాళ్లు ౩ లక్షల షార్ప్ సోలార్సెల్స్ ఉపయోగించి ఈ రూఫ్టాప్ మీద 5769 ఫోటోవోల్టాయిక్ మాడ్యూల్స్ని నిర్మించారు. ఇక్కడ 904 కిలోవాట్ విద్యుదుత్పాదన జరుగుతుంది.
వీళ్లకి ఇది ఎందుకూ? ఈ విద్యుత్తు వాళ్ల 80 శాతం అవసరాల్ని తీరుస్తుందట. వాళ్ల ఈ హబ్ లో రోజుకి 260,000 ప్యాకేజీలు వస్తుంటాయట. వాటిని కన్వేయర్ బెల్టులమీద సెగ్రిగేట్ చెయ్యటానికీ, కంటైనర్లలోకి పంటానికీ ఆ ఫెసిలిటీని నడపడానికీ చాలా విద్యుత్తు అవసరం.
ఇది చదివి నేను ఆశ్చర్యపోయా.
మన హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాంటి పెద్ద పెద్ద ఇన్స్టాల్లేషన్స్ ని నడాపడానికి ఎన్ని కిలోవాట్ల విద్యుత్తు అవసరం? మనంకూడా ఇలా సాంప్రదాయేతర వనరుల్ని వినియోగించుకుంటే ....

సోలార్ విద్యుత్తు

మీ సమాచారం కొరకు:
ఇస్రాయేల్ లో ప్రతీ ఇంటికీ సోలార్ వాటర్ హీటర్లు తప్పని సరి - మ్యాన్డేటోరీ. అక్కడి ప్రభుత్వం అలాంటి మ్యాన్డేటోరీలని ఇంకొన్ని ప్రవేశపెట్టబోతోంది. మనోళ్ళు ఇక్కడ నాకు కుర్చీ అంటే నాకు కుర్చీ అని కొట్టుసావటమే కానీ ఇలాంటి ఒక్క నిర్ణయం లేదు. ఆలోచించండి.

సాంప్రదాయేతర వనరులు

సాంప్రదాయేతర వనరుల్ని ఎఫిషియెంట్ గా ఎలా ఉపయోగించుకోవాలి?
రాబోయే ౨౦ (ఇరవయ్) సంవత్సరాలల్లో విద్యుత్తు ఉత్పత్తి/ఖర్చు కి మధ్య ఉన్న అంతరాన్ని ఎలా ఎదుర్కోవాలి?