Wednesday, February 25, 2009

యం.సి.యేలకి, సి.యస్.ఇ లకీ ఓ ప్రాజెక్ట్ ఆలోచన -౧

మీకు మార్పుని ఎలా కంట్రోల్ చెయ్యొచ్చో తెలుసా?
అసలు మార్పు అంటే? దీన్నే ఆంగ్లమున Change అంటాం. Change ని కంట్రోల్ చెయ్యటాన్నే Change Control అంటాం. దీన్ని అదుపు చేసేది యాజమాన్యాన్ని Change Management అంటాం.
అసలు ముందు దీని యొక్క నిజమైన అర్ధం ఏంటో చూద్దాం.
మీ ఇంట్లో ఓ రెండు బీరువాలు ఉన్నాయి. నాలుగు కప్-బోర్డ్స్ ఉన్నాయి. మీరు మీ మెళ్ళోని గొలుసు తీసి ఎ బీరువాలో పెట్టారు. మీ తమ్ముడు ఓ గంట తర్వాత వచ్చి, గొలుసు చూసి అర్రె, ఇది ఇక్కడ ఎవరు పెట్టారు అని, తీసి బి బీరువాలో పెట్టాడు. ఇంతలో మీ నాన్న గారు వచ్చి దాన్ని కప్-బోర్డ్ ౧ లోకి మార్చారు. మీరు స్నానం గట్రా ముగించుకుని వచ్చి బీరువా ఎ లో చూస్తే అది లేదు. బుర్ర గిర్రున తిరిగింది మీకు. పద్దెనిమిది గ్రాముల బంగారం గొలుసు, ఎలా అని అరిచారు. మీతమ్ముడు విషయం చెప్పాడు, మీనాన్న గారు ఆయన ఎక్కడకి మార్చిందీ చెప్పారు. ఆ "గొలుసు" యొక్క స్థల మార్పిడి అనేది "ఛేంజ్". కాబట్టి ఇలా మార్పు జరిగినప్పుడు ఓ చిన్న నోటు "నేనే మార్చాను" అని మార్చిన వాళ్లు పెడితే, ఆ మార్పుకి సంబంధించిన వాళ్లందరికీ తెలుస్తుంది. ఇప్పుడు దీన్ని ఇంకొంత మ్యాగ్నిఫై చేసి చూస్తే, మీ ఆఫీసులో మీ టెబిలు మీద మీ ఆఫీసు వాళ్లు ఇచ్చిందే ఓ ప్రింటర్ ఉంది. అది కేవలం మీకోసమే. మీరు ఈరోజు సాయంత్రం ఇంటికి వెళ్లేప్పుడు మీ డెస్కుమీదనే ఉంది. రేపొద్దున వచ్చేప్పటికి లేదు. మీ సిస్టంలో ఆ ఒక్క ప్రింటరే కాన్ఫిగర్ చేసి ఉంది. మీ బాసు ఏదో రిపోర్ట్ ఒక్క నిమిషంలో ముద్రించి ఆయన బల్లమీద పెట్టాలి అని కౌంటుడౌన్ క్లాక్ నొక్కి పెట్టాడు. ఎలా? కాబట్టి, ఆఫీసులో ఏమైన ఎక్కడనుండి ఎక్కడికైన జరపాలన్నా, చెయ్యాలన్నా, ఆ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయిన వాళ్లకి ప్రయర్ నోటీస్ ఇచ్చి మార్పు చెయ్యటమే Change Management.
దీన్ని సిస్టంస్ కి ఎలా అన్వయిస్తాం?
నా దృష్టిలో సిస్టంస్ అనేవి మూడు రకాలు.
౧. డెస్క్టాప్
౨. మొబైల్
౩. సెర్వర్

వీటిల్లో డెస్క్టాప్ని లేక, సర్వర్ ని లేక, ల్యాప్టాప్ని ఒకచోటానుండి ఇంకోచోటకి, లేక కుర్చీని మార్చటం, లేక మానిటర్ ని మార్చటం ఇవన్నీ ఓక రకమైన Change Control లోకి వస్తే, దాన్నే ఆఫీస్ మేనేజ్మెంటు, డెస్క్టాప్లో సాఫ్ట్వేర్ని మార్చటం, లేక ఓ లైసెన్స్డ్ సాఫ్ట్వేర్ ని వెయ్యటం ఇలాంటివి ఇంకోరకమైన Change Control లోకి వస్తే, దీన్నే ఆఫీస్ ఆటోమేషన్ మేనేజ్మెంట్ అనొచ్చు, ఇక సర్వర్లలో మార్పులు చేర్పులు ఇది సర్వర్ Change Control అంటాం.
నేను మాట్లాడబొయ్యేది ఈ మూడో రకం గురించి.
ఒక టిపికల్ ఉదాహరణ చూద్దాం:- మాదగ్గర ఓ పదిహేను సర్వర్లు ఉన్నాయ్. అన్నీ యూనిక్స్ బాక్సులు. అన్నిటికీ ర్యాం పెంచాలి అని నిర్ణయించారు ఓ మీటింగులో. కాబట్టి సర్వర్ గ్రూప్ వాళ్లు ఓ మెయిల్ పెట్టారు ఆ సర్వర్ల మీద నడుస్తున్న అన్నీ సాఫ్ట్వేర్ల అడ్మినిస్ట్రేటర్లకు, "ఇలా పలానీ రోజు మేము ర్యాం పెట్టబోటున్నాం, కాబట్టి ఆరోజున ఇన్ని గంటలనుండి ఇన్ని గంటలవరకూ సర్వర్లు అందుబాటులో ఉండవూ" అని. దీని అర్ధం ఏంటీ అంటే ఆ సమయంలో మీరు ఏలాంటి సర్వర్ యాక్టివిటీనీ పెట్టుకోవద్దూ అని. అంటే, ఆ సర్వర్లపై పనిచేస్తున్న సాఫ్ట్వేర్ల మేనేజర్లూ, మీరు మీమీ స్టేఖోల్డర్లకు చెప్పుకోండీ అని. దేనికంటే వాటిల్లో మిషన్ క్రిటికల్ అప్ప్లికేషన్లు ఉండవచ్చు. ఆ సమయానికి కొందరు యూజర్లు ముఖ్యమైన ట్రాన్సాక్షన్లు చెయ్యటానికి ముందుగానే తయ్యారై ఉండవచ్చు. వాళ్లు ఆ సమయంలో ఈ సర్వర్లపై నడుస్తున్న అప్ప్లికేషన్లను వాడాటానికి ఉద్యుక్తులైతే వారికి ప్రస్తుతానికి ఈ అప్ప్లికేషన్ పని చెయ్యటంలేదు అనే మెస్సేజీ ఎక్కిరైంచినట్టు వస్తే అది మొత్తం "బిజినెస్" నే దెబ్బతీయవచ్చు.
కాబట్టి, సహజంగా ఇలా ఔటేజీ లేక ముఖ్యమైన మార్పులు చేసేప్పుడు ఆ ప్రాసెస్ లో చేతులున్న అందర్నీ పిలిచి, ఓ తేదీని నిర్ణయించి అందరికీ ముందుగానే తెలియజేసి ఆ పార్పుని అమలు చేస్తారు.
కాబట్టి, ఇలాంటి మార్పుని అమలు చేసే విధానమే Change Management. ఈ ప్రాసెస్లో కొన్ని ఉపకరణాలు ఉంటాయి. ఓ ముఖ్యమైనది, ఓ డాక్యుమెంటు. దాన్నే ఛేంజ్ కంట్రోల్ ఫాం అంటాం. దీనిమీద ఎప్పుడు ఎలా ఎవరు ఏఏ మార్పులు ఎవ్వరికెవ్వరికి వర్తిస్తుంది అని చెప్పి, సంతకాలు పెట్టి ఆఆ డిపార్టుమెంట్లకి పంపిస్తారు.

కీ: Change, Change Control, Change Control Form, Change Management

1 comment:

రాజేష్ జి said...

మంచి ఆలోచన.. పంచుకున్నవిధాన౦ చాలాబావుంది.