Wednesday, March 18, 2009

పేపర్ - కొంత సమాచారం

* ఆదివారం పేపర్ ని అచ్చు వెయ్యటానికి 500,000 చెట్లు అవసరం ఔతాయి.
* ఒక్క ఆదివారం న్యూ యార్క్ టైంస్ ని రెసైకిల్ చేస్తే 75,000 చెట్లని రక్షించినట్టౌతుంది.
* అన్నీ వార్తా పత్రికల్ని, అన్నీరోజులవి కలిపి రిసైకిల్ చేతే 250,000,000 చెట్లని రక్షించినట్టు లెక్క.
* రెండో ప్రపంచ యుద్ధం అప్పుడు 33% కాయితాన్ని రెసైకిల్ చేసేవారట. ఇప్పుడు ఈ శాతం గణనీయంగా పడిపోయింది.
* మీ ఇంట్లో 15 సంవత్సరాల చెట్టు ఉంటే, దాంతోకనక పేపర్ సంచి తయ్యారు చేస్తే, మొత్తం 700 వరకు అవుతాయి. ఒక సూపర్ మార్కెట్టు ఒక్క గంటలో ఇన్ని కాయితపు సంచుల్ని వాడితే, సంవత్సరానికి, ఒక సూపర్ మార్కెట్టు 60,500,000 కాయితపు సంచుల్ని ఉపయోగిస్తుంది. ఇలాంటి సూపర్మార్కెట్లు అమెరికాలు ఎన్నిఉన్నాయో వాటి అవసరాలు ఏంటో, ఎన్ని చెట్లు కావాల్సొస్తుందో ఆలోచించండి.
* అమెరికాలో ఒక రోజుకి పారేసే ఆహారం, కాయితంతో 50,000,000 ఇళ్లకి 20 సంవత్సరాలకి సరిపోను వేడిని అందివ్వొచ్చు.
* సంవత్సరానికి దాదాపు 1 బిలియన్ చెట్ల సమానమైన కాయితాన్ని పడేస్తారు అమెరికాలో.
* సరాసరి, ఒక ఇంట్లో, 13,000 కాయితపు ముక్కల్ని పడేస్తారు. జంక్ ఉత్తరాలు కావొచ్చు లేక ప్యాకేజివి కావొచ్చు.
* అమెరికాలో వార్తాపత్రికలు 27% రి-సైకిల్డ్ కాయితాన్ని వాడతాయి.
* ప్రతీ టన్ను రిసైకిల్డ్ కాయితం 17 చెట్లని రక్షిస్తే, 380 గ్యాలన్ల నూనెని, 3 చదరపు అడుగుల స్థలాన్ని, 4000 కిలో వాట్ల ఇంధనాన్ని, 7000 గ్యాలనుల నీళ్లని సేవ్ చేసినట్టు లెక్క.
* ఈ 17 చెట్లు 250 పౌండ్ల కార్బన్ డైఆక్సైడ్ ని వాతావరణం నుండి గ్రహిస్తాయి.

ఈలెక్కన మనకి భారతంలో ప్రతీ ఆదివారం పత్రికని అచ్చు వెయ్యటానికి ఎన్ని చెట్లు కావాల్సొస్తుందో.
అయితే - ఇన్ని చెట్లని నరికి కాయితాన్ని తయ్యారుజేసి, దానిమీద వార్తల్ని అచ్చుగుద్ది మనకి అందిస్తున్న పత్రికలు, కనీస పత్రికా విలువలతో నిజాల్ని అందించకపోవటం ఘోరం, అమానుషం, బాధ్యతా రాహిత్యం.

గమనిక :- ఇవి అమెరికా లెక్కలు మాత్రమే.

Thursday, February 26, 2009

యం.సి.యేలకి, సి.యస్.ఇ లకీ ఓ ప్రాజెక్ట్ ఆలోచన -౨

ఇది చదివే ముంది, దీని ముందరి పోష్టు చదివి తీరాలి. ఇక్కడచూడండి.
పై పోష్టులో ఛేంజ్ కంట్రోల్ అంటే ఏంటో చూసాం. మరి దీంట్లో ప్రాజెక్టు ఏంటీ అంటారా? వస్తున్నా...

సాధారణంగా ఈ Change Control కి ఒక life cycle ఉంటుంది. అంటే, మొదలు - స్టెప్పు 1, స్టెప్పు 2... యాట యాట యాట - అంతం.
Change Management would typically comprise the raising and recording of changes, assessing the impact, cost, benefit and risk of proposed changes, developing business justification and obtaining approval, managing and co-ordinating change implementation, monitoring and reporting on implementation, reviewing and closing change requests.
ITIL defines the change management process this way:

The goal of the Change Management process is to ensure that standardized methods and procedures are used for efficient and prompt handling of all changes, in order to minimize the impact of change-related incidents upon service quality, and consequently improve the day-to-day operations of the organization.

Change management is responsible for managing change process involving:

Hardware
Communications equipment and software
System software
All documentation and procedures associated with the running, support and maintenance of live systems.

Any proposed change must be approved in the change management process. While change management makes the process happen, the decision authority is the Change Advisory Board (CAB), which is made up for the most part of people from other functions within the organization. The main activities of the change management are:

Filtering changes
Managing changes and the change process
Chairing the CAB and the CAB/Emergency committee
Reviewing and closing of Requests for Change (RFCs)
Management reporting and providing management information


Change Control రకరకాలుగా ఉంటుంది:
కొన్ని ఉదాహరణలు-
ఓ అప్ప్లికేషన్ ఏ అనే సర్వర్ మీద, బి అనే అప్ప్లికేషన్ సర్వర్ పై నడుస్తున్నది. అయితే, ఆ అప్ప్లికేషన్ డెవలప్మెంటు మేనేజరు, కొన్ని స్టడీలవల్లా, కొన్ని కారణాలవల్లా లాగులని పరీక్షించాక ఆ అప్ప్లికేషన్కి కావాల్సినంత మెమొరీ లేదు అని తేల్చి, బి అప్ప్లికేషన్ సర్వర్ యొక్క మెమరీ పాదమిద్ర ని పెంచమని ఒక మీటింగు పెట్టి, అందర్నీ అంగీకరింపజేసాడు. ఏ అనే సర్వర్ ప్రొడక్షను సర్వర్ ప్లాట్ఫారం, బి అనే అప్ప్లికేషన్ సర్వర్ ఓ 24x7 అప్లికేషన్ని హోస్ట్ చేస్తోంది.
మరి ఆ అప్ప్లికేషన్ సర్వర్ హీపు పాదముద్రని పెంచాలి అంటే సర్వర్ యడ్మిన్ లోకి వెళ్లి మార్చి, అప్ప్లికేషన్ సర్వర్ ని ఆపేసి, మళ్లీ స్టార్ట్ చెయ్యాలి.
ఈ ప్రాసెస్సు కి లైఫ్సైకిల్ ఎలా ఉండొచ్చు? ఇలా ఉండొచ్చేమో ఆలోచించండి -
౧. ఎవ్వరు ఈ ప్రాసెస్సుని మొదలుపెట్టాలి? అప్ప్లికేషన్ సర్వర్ యడ్మిన్. మొదలు పెట్టేది - యడ్మిన్ (నువ్వే అనుకో ఓం పర్లేదు, అనుకో కొంచెంసేపు)
౨. ఎవ్వరెవ్వరికి ముందుగా చెప్పాలి?
అ. హార్డ్వేర్ యడ్మిన్ కి
ఆ. నెట్వర్క్ యడ్మిన్కి (ఆప్షనల్)
ఇ. యల్డ్యాప్ యడ్మిన్కి (ఆప్షనల్)
ఈ. డీ.బి.యేకి
ఉ. అప్ప్లికేషన్ డెవలప్మెంటు మేనేజర్కి (అతను అప్ప్లికేషన్ కి అధిపతి - ఓనర్)
ఊ. మీ మేనెజర్ కి (ఇతను ఔను - ముందుకు వెళ్లు అంటేనే)
ఋ. ఆదే సర్వర్ మీద ఇంకా ఏమైనా అప్ప్లికేషన్లు నడుస్తూంటే వాళ్లకి (చాలా అవసరం)
౩. చెప్పాక, అందరు సూపర్వైజర్లు, అంటే మేనేజర్లు సరే అని చప్పుకుంటే, అందరి వోటుతో ఓ రోజు నిర్ణయించి
౪. నీ సిస్టం బ్యాక్ అప్ తీస్కుని, సిద్ధం చేస్కుని
౫. ఆ పలానీ రోజున, పలానీ టైంకి, ఆ మార్పుని అమలుపరచి, సర్వర్ ని బౌన్సు చేసి, స్మోక్ పరీక్ష జరిపి
౬. మళ్ళీ అందరు డెవలప్మెంటు మేనేజర్లకి తెలిపితే, వారు వాళ్ల టీము నుండి ఓ డెవలపర్ ని ముందుగా పొగ పరీక్ష జరిపి తృప్తి చెందాక
౭. నీతో సరే అని పచ్చజెండా ఊపితే, నువ్వు, మళ్లీ అందరికీ - "సర్వర్ సర్వీసులు సిద్ధం" అని ఎనౌన్సు చేస్తే
౮. అప్పుడు నువ్వుని విజయవంతంగా మూస్తావు.

కాబట్టి ఆది నుండి అంతం దాకా ఇదో ప్రక్రియ. ఓ కొరియోగ్రఫి.
ఇప్పుడు మాన్యువల్గా ఎలా చేస్తాం ఇదీ? స్లో మోషన్లో చెప్పుకుందాం.
మీటింగుకి పిలువు.
చెప్పు.
అందరి అంగీకారం తీస్కో.
దీని వల్ల కలగబొయ్యే పరీస్థితులను అందరికీ వివరించు.
Change Control Form బయటకి తీ,
అన్నీ రాయి,
ఎవ్వరెవ్వరు ఎఫ్ఫెక్ట్ అవుతారు, ఏంకధ అంతా
అందరి సంతకాలు తీస్కో.
తలా ఓ కాపీ ఇవ్వు.
ఓ మెయిల్ పంపు అందరికీ
అయ్యాక అమలు పరచు.
అయ్యాక మెయిల్ పంపు.
పొగ పరీక్ష అయ్యక వాళ్లు నీకు మెయిల్ పంపుతారు.
అప్పుడు నువ్వు మిగతా అందరికీ అన్నౌన్స్ చేస్తావు మెయిల్ ద్వారా.

---

ఇప్పుడు దీన్ని ఫాస్ట్ మోషన్ లో చూద్దామా?

నీ దగ్గర ఓ యాభై అప్ప్లికేషన్ సర్వర్లు ఉన్నాయి. మొత్తం ముఫై హార్డ్వేర్ సర్వర్లపై నడుస్తున్నాయి ఇవి. మొత్తం తొంభై మిషన్ క్రిటికల్ 24X7 అప్ప్లికేషన్లు పరిగెత్తుతున్నాయి వాటిమీద. కొన్ని ఎక్స్టర్నల్, కొన్ని ఇంటర్నల్. ఇప్పుడు ఇలాంటి Change Control వారానికి పదిహేను చెయ్యాలి. ఓ అప్ప్లికేషన్ ని మళ్లీ ఇన్స్టాల్ చెయ్యాలి, ఓ సర్వర్ లో ఎదో క్లాస్పాత్ ప్రాబ్లం వచ్చింది, బౌన్స్ చెయ్యాలి దాన్ని, ఇంకోదాంట్లో ఓ కొత్త ఫైల్ ని పెట్టలి, ఇంకోదాంట్లో ఓ ఫైల్ ని తీసెయ్యాలి, ఇంకో సర్వర్ లో ఫైల్ సిస్టం నిండిపోయింది.
ఇప్పుడు ఎలా చేస్తావ్? ఎలా వస్తాయి నీకు రిక్వెస్ట్లు? ఎలా నువ్వు డీల్ చెయ్యాలి?

పైన చెప్పిన ప్రతీ స్టెప్పుని అమలి చేసేప్పుడు కూడా ఒక లైఫ్ సైకిల్ ఉంటుంది, దాన్ని PDCA అంటాం.

PDCA ("Plan-Do-Check-Act") is an iterative four-step problem-solving process typically used in business process improvement.
P - ప్లాన్ - అంటే పలాని రోఝున పలాని పని ఛేంజ్ కంట్రోల్లో చెప్పినట్టుగా.
D - అమలు చెయ్యి. ర్యాం ని పెంచటమో ఎదో ఓటి ముందుగా ఛేంజ్ కంట్రోల్లో చెప్పినట్టుగా.
Check - ఓ సారి సరిచూడు. Operation Readiness Test (ORT) అంటారు, కొంతమంది స్మోక్ టెస్ట్ అంటారు.
Act - అయ్యాక ఏమైన సమస్యలు వస్తే re-Do PDCA అని.

(Source - http://en.wikipedia.org/wiki/PDCA)

Wednesday, February 25, 2009

యం.సి.యేలకి, సి.యస్.ఇ లకీ ఓ ప్రాజెక్ట్ ఆలోచన -౧

మీకు మార్పుని ఎలా కంట్రోల్ చెయ్యొచ్చో తెలుసా?
అసలు మార్పు అంటే? దీన్నే ఆంగ్లమున Change అంటాం. Change ని కంట్రోల్ చెయ్యటాన్నే Change Control అంటాం. దీన్ని అదుపు చేసేది యాజమాన్యాన్ని Change Management అంటాం.
అసలు ముందు దీని యొక్క నిజమైన అర్ధం ఏంటో చూద్దాం.
మీ ఇంట్లో ఓ రెండు బీరువాలు ఉన్నాయి. నాలుగు కప్-బోర్డ్స్ ఉన్నాయి. మీరు మీ మెళ్ళోని గొలుసు తీసి ఎ బీరువాలో పెట్టారు. మీ తమ్ముడు ఓ గంట తర్వాత వచ్చి, గొలుసు చూసి అర్రె, ఇది ఇక్కడ ఎవరు పెట్టారు అని, తీసి బి బీరువాలో పెట్టాడు. ఇంతలో మీ నాన్న గారు వచ్చి దాన్ని కప్-బోర్డ్ ౧ లోకి మార్చారు. మీరు స్నానం గట్రా ముగించుకుని వచ్చి బీరువా ఎ లో చూస్తే అది లేదు. బుర్ర గిర్రున తిరిగింది మీకు. పద్దెనిమిది గ్రాముల బంగారం గొలుసు, ఎలా అని అరిచారు. మీతమ్ముడు విషయం చెప్పాడు, మీనాన్న గారు ఆయన ఎక్కడకి మార్చిందీ చెప్పారు. ఆ "గొలుసు" యొక్క స్థల మార్పిడి అనేది "ఛేంజ్". కాబట్టి ఇలా మార్పు జరిగినప్పుడు ఓ చిన్న నోటు "నేనే మార్చాను" అని మార్చిన వాళ్లు పెడితే, ఆ మార్పుకి సంబంధించిన వాళ్లందరికీ తెలుస్తుంది. ఇప్పుడు దీన్ని ఇంకొంత మ్యాగ్నిఫై చేసి చూస్తే, మీ ఆఫీసులో మీ టెబిలు మీద మీ ఆఫీసు వాళ్లు ఇచ్చిందే ఓ ప్రింటర్ ఉంది. అది కేవలం మీకోసమే. మీరు ఈరోజు సాయంత్రం ఇంటికి వెళ్లేప్పుడు మీ డెస్కుమీదనే ఉంది. రేపొద్దున వచ్చేప్పటికి లేదు. మీ సిస్టంలో ఆ ఒక్క ప్రింటరే కాన్ఫిగర్ చేసి ఉంది. మీ బాసు ఏదో రిపోర్ట్ ఒక్క నిమిషంలో ముద్రించి ఆయన బల్లమీద పెట్టాలి అని కౌంటుడౌన్ క్లాక్ నొక్కి పెట్టాడు. ఎలా? కాబట్టి, ఆఫీసులో ఏమైన ఎక్కడనుండి ఎక్కడికైన జరపాలన్నా, చెయ్యాలన్నా, ఆ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయిన వాళ్లకి ప్రయర్ నోటీస్ ఇచ్చి మార్పు చెయ్యటమే Change Management.
దీన్ని సిస్టంస్ కి ఎలా అన్వయిస్తాం?
నా దృష్టిలో సిస్టంస్ అనేవి మూడు రకాలు.
౧. డెస్క్టాప్
౨. మొబైల్
౩. సెర్వర్

వీటిల్లో డెస్క్టాప్ని లేక, సర్వర్ ని లేక, ల్యాప్టాప్ని ఒకచోటానుండి ఇంకోచోటకి, లేక కుర్చీని మార్చటం, లేక మానిటర్ ని మార్చటం ఇవన్నీ ఓక రకమైన Change Control లోకి వస్తే, దాన్నే ఆఫీస్ మేనేజ్మెంటు, డెస్క్టాప్లో సాఫ్ట్వేర్ని మార్చటం, లేక ఓ లైసెన్స్డ్ సాఫ్ట్వేర్ ని వెయ్యటం ఇలాంటివి ఇంకోరకమైన Change Control లోకి వస్తే, దీన్నే ఆఫీస్ ఆటోమేషన్ మేనేజ్మెంట్ అనొచ్చు, ఇక సర్వర్లలో మార్పులు చేర్పులు ఇది సర్వర్ Change Control అంటాం.
నేను మాట్లాడబొయ్యేది ఈ మూడో రకం గురించి.
ఒక టిపికల్ ఉదాహరణ చూద్దాం:- మాదగ్గర ఓ పదిహేను సర్వర్లు ఉన్నాయ్. అన్నీ యూనిక్స్ బాక్సులు. అన్నిటికీ ర్యాం పెంచాలి అని నిర్ణయించారు ఓ మీటింగులో. కాబట్టి సర్వర్ గ్రూప్ వాళ్లు ఓ మెయిల్ పెట్టారు ఆ సర్వర్ల మీద నడుస్తున్న అన్నీ సాఫ్ట్వేర్ల అడ్మినిస్ట్రేటర్లకు, "ఇలా పలానీ రోజు మేము ర్యాం పెట్టబోటున్నాం, కాబట్టి ఆరోజున ఇన్ని గంటలనుండి ఇన్ని గంటలవరకూ సర్వర్లు అందుబాటులో ఉండవూ" అని. దీని అర్ధం ఏంటీ అంటే ఆ సమయంలో మీరు ఏలాంటి సర్వర్ యాక్టివిటీనీ పెట్టుకోవద్దూ అని. అంటే, ఆ సర్వర్లపై పనిచేస్తున్న సాఫ్ట్వేర్ల మేనేజర్లూ, మీరు మీమీ స్టేఖోల్డర్లకు చెప్పుకోండీ అని. దేనికంటే వాటిల్లో మిషన్ క్రిటికల్ అప్ప్లికేషన్లు ఉండవచ్చు. ఆ సమయానికి కొందరు యూజర్లు ముఖ్యమైన ట్రాన్సాక్షన్లు చెయ్యటానికి ముందుగానే తయ్యారై ఉండవచ్చు. వాళ్లు ఆ సమయంలో ఈ సర్వర్లపై నడుస్తున్న అప్ప్లికేషన్లను వాడాటానికి ఉద్యుక్తులైతే వారికి ప్రస్తుతానికి ఈ అప్ప్లికేషన్ పని చెయ్యటంలేదు అనే మెస్సేజీ ఎక్కిరైంచినట్టు వస్తే అది మొత్తం "బిజినెస్" నే దెబ్బతీయవచ్చు.
కాబట్టి, సహజంగా ఇలా ఔటేజీ లేక ముఖ్యమైన మార్పులు చేసేప్పుడు ఆ ప్రాసెస్ లో చేతులున్న అందర్నీ పిలిచి, ఓ తేదీని నిర్ణయించి అందరికీ ముందుగానే తెలియజేసి ఆ పార్పుని అమలు చేస్తారు.
కాబట్టి, ఇలాంటి మార్పుని అమలు చేసే విధానమే Change Management. ఈ ప్రాసెస్లో కొన్ని ఉపకరణాలు ఉంటాయి. ఓ ముఖ్యమైనది, ఓ డాక్యుమెంటు. దాన్నే ఛేంజ్ కంట్రోల్ ఫాం అంటాం. దీనిమీద ఎప్పుడు ఎలా ఎవరు ఏఏ మార్పులు ఎవ్వరికెవ్వరికి వర్తిస్తుంది అని చెప్పి, సంతకాలు పెట్టి ఆఆ డిపార్టుమెంట్లకి పంపిస్తారు.

కీ: Change, Change Control, Change Control Form, Change Management

Wednesday, December 24, 2008

posterous

మీ మెయిల్ నుండే మీరు బ్లాగ్పోష్టు రాద్దామనుకుంటున్నారా?
మీ మెయిల్ నుండి మీరు ఓ యం.పీ.మూడుని మీ బ్లాగుకి పబ్లిష్ చేద్దామనుకుంటున్నారా?
మీ మెయిల్ నుండి ఓ ఫోటో మీ బ్లాగుకి పబ్లిష్ చేద్దామన్కుంతున్నారా?
ఇది వాడండి పోస్టెరస్. ఉదాహరణకి నా పోస్టెరస్ బ్లాగు ఇక్కడ

Saturday, December 6, 2008

యం.సి.యేలకి, సి.యస్.ఇ లకీ ఓ ప్రాజెక్ట్ ఆలోచన

మీరు ప్రాజెక్ట్ వర్కు కోసం వెతుకుతున్నారా. ఐతే ఇక్కడనుండి మొదలెట్టండి.

మీదెగ్గర మొబైలు ఫోను ఉంది అనుకోండి. హారిక మీకు ఫోను చేసింది, మీరు మాట్టాడుతున్నారు, ఈలోపల నరేష్ చేసాడు. మీలైను ఖాళీగాలేదు కాబట్టి, అతని కాల్ వాయీస్ మెసేజిబాక్స్కి వెళ్తుంది అనుకుందాం. నరేష్ మీకో వాయీస్ మెస్సేజ్ వదిలాడు, "ఆరేయ్!! నువ్వు బహుసా బిజీగా ఉన్నట్టు ఉన్నావ్. నా మెసేజ్ చూస్కోంగనే నాకు మళ్లీ కాల్ చెయ్" అని. Is it possible to convert this voice message to a text and push to your mobiles messages inbox as text, meaning, convert that voice into text?
If possible, start doing it :):)

Think

Added : Dec 8th.
ఎలాంటి పరీస్తుతుల్లో వాయీస్ మెస్సేజ్లు వస్తాయ్? ఎలాంటి పరీస్తిత్తుల్లో వాటిని టెక్స్టుగా మార్చవచ్చు?
#1. You are out of coverage area, some one called you, call gone to your vioce message box, caller left a message. You got say 23 calls on that day, all of them somehow went to your voice message box. Dont you think its good if u can have those converted to ur text message than hearing to each call?
#2. You are in a meeting, u set ur mobile to silent. U got three imp calls. you can check text inbox but, situation is not allowing u check your voice messages. is it not a good idea to have those voice calls as text messages?
#3. You are on a call with your boss, thru ur blootooth, you got an imp call from say, ur wife, father, he left a message. If you have this finctionlity, you can keep talking to your boss, parallelly check this message too.
yaata yaata yaata..

Wednesday, December 3, 2008

విజ్ఞప్తి

విశాఖపట్టణం నుండి, హైదరాబాదు నుండి, గుంటూర్ విజయవాడల నుండి ఎవరైనా బ్లాగర్లు ఈ నా పోష్టుని చదివితే, దయచేసి నాకు ఒక ఇ-ఉత్తరం రాయగలరు. నాకు మన వాటర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్ మీద కొంత సమాచారం కావాలి.
నా ఇ-ఉత్తరం చిరునామా - projectsforfuture@gmail.com
జై హింద్

Monday, December 1, 2008

హోమ్ ఎనర్జి స్టేషన్


The Home Energy Station, which generates hydrogen from natural gas, is designed to provide heat and electricity for the home through fuel cell cogeneration and to supply fuel for a hydrogen-powered fuel cell vehicle.
Honda has worked in cooperation with technology partner Plug Power, Inc., to reduce size and increase convenience in each subsequent generation of the Home Energy Station.
Read the complete Story Here:
http://automobiles.honda.com/fcx-clarity/home-energy-station.aspx
పైన బొమ్మలో నాకు ముఖ్యమైనవిగా తోచినవాటిని మార్క్ చేసాను.
ఈ లింక్ నాకు పంపినది - అమర్, సిస్టం యడ్మినిస్ట్రేటర్, హైదరాబాద్.