* ఆదివారం పేపర్ ని అచ్చు వెయ్యటానికి 500,000 చెట్లు అవసరం ఔతాయి.
* ఒక్క ఆదివారం న్యూ యార్క్ టైంస్ ని రెసైకిల్ చేస్తే 75,000 చెట్లని రక్షించినట్టౌతుంది.
* అన్నీ వార్తా పత్రికల్ని, అన్నీరోజులవి కలిపి రిసైకిల్ చేతే 250,000,000 చెట్లని రక్షించినట్టు లెక్క.
* రెండో ప్రపంచ యుద్ధం అప్పుడు 33% కాయితాన్ని రెసైకిల్ చేసేవారట. ఇప్పుడు ఈ శాతం గణనీయంగా పడిపోయింది.
* మీ ఇంట్లో 15 సంవత్సరాల చెట్టు ఉంటే, దాంతోకనక పేపర్ సంచి తయ్యారు చేస్తే, మొత్తం 700 వరకు అవుతాయి. ఒక సూపర్ మార్కెట్టు ఒక్క గంటలో ఇన్ని కాయితపు సంచుల్ని వాడితే, సంవత్సరానికి, ఒక సూపర్ మార్కెట్టు 60,500,000 కాయితపు సంచుల్ని ఉపయోగిస్తుంది. ఇలాంటి సూపర్మార్కెట్లు అమెరికాలు ఎన్నిఉన్నాయో వాటి అవసరాలు ఏంటో, ఎన్ని చెట్లు కావాల్సొస్తుందో ఆలోచించండి.
* అమెరికాలో ఒక రోజుకి పారేసే ఆహారం, కాయితంతో 50,000,000 ఇళ్లకి 20 సంవత్సరాలకి సరిపోను వేడిని అందివ్వొచ్చు.
* సంవత్సరానికి దాదాపు 1 బిలియన్ చెట్ల సమానమైన కాయితాన్ని పడేస్తారు అమెరికాలో.
* సరాసరి, ఒక ఇంట్లో, 13,000 కాయితపు ముక్కల్ని పడేస్తారు. జంక్ ఉత్తరాలు కావొచ్చు లేక ప్యాకేజివి కావొచ్చు.
* అమెరికాలో వార్తాపత్రికలు 27% రి-సైకిల్డ్ కాయితాన్ని వాడతాయి.
* ప్రతీ టన్ను రిసైకిల్డ్ కాయితం 17 చెట్లని రక్షిస్తే, 380 గ్యాలన్ల నూనెని, 3 చదరపు అడుగుల స్థలాన్ని, 4000 కిలో వాట్ల ఇంధనాన్ని, 7000 గ్యాలనుల నీళ్లని సేవ్ చేసినట్టు లెక్క.
* ఈ 17 చెట్లు 250 పౌండ్ల కార్బన్ డైఆక్సైడ్ ని వాతావరణం నుండి గ్రహిస్తాయి.
ఈలెక్కన మనకి భారతంలో ప్రతీ ఆదివారం పత్రికని అచ్చు వెయ్యటానికి ఎన్ని చెట్లు కావాల్సొస్తుందో.
అయితే - ఇన్ని చెట్లని నరికి కాయితాన్ని తయ్యారుజేసి, దానిమీద వార్తల్ని అచ్చుగుద్ది మనకి అందిస్తున్న పత్రికలు, కనీస పత్రికా విలువలతో నిజాల్ని అందించకపోవటం ఘోరం, అమానుషం, బాధ్యతా రాహిత్యం.
గమనిక :- ఇవి అమెరికా లెక్కలు మాత్రమే.
Wednesday, March 18, 2009
Subscribe to:
Post Comments (Atom)
3 comments:
కాగితం తయారీకోసం ప్రత్యేకంగా చెట్లు పెంచుతారు. ఆ చెట్ల పేరేమిటో ప్రస్తుతం నాకు గుర్తులేదు. అవి ప్రతి మూడు నెలలకోసారి పంటకొస్తాయి.
@ నాగ్ :-
ఎ చెట్టు ఈజ్ ఏ చెట్టు. నువ్వు చెప్పేది సుబాబుల్ తోట లేక, యూకలిపిటస్ తోట లేక సర్గుడు తోట. సామాన్యంగా ఇవే వాడేది.
ఐ.టీ.సి-ఐ.యల్.టి.డి వాళ్లు సంయుక్తంగా భద్రాచలం పేపర్ మిల్లు కోసం, రైతులతో కలిసి పై చెట్ల పంట వేయిస్తుంటారు. యన్.హెచ్-౫ మీద గుంటూరు నుండి దాదాపు కావలి వరకు ఇవి కనపడుతూనే ఉంటాయి.
Useful article
Post a Comment